Sunday, July 12, 2009

స్నేహ వీణ


ఆకులు లేక కొమ్మలే వుంటే
మోడుబారింది ఈ వృక్షం అని అంటాం
స్నేహం లేక మనిషి వుంటే
మోడుబారిన జీవితమే అతనిది అవుతుంది ఏమంటారు
స్నేహం లేకపోతె జీవన వీణ పలుకదు
ఒక వేళ పలికిన అందున అంతంత రాగాలే తప్ప
ఆనంద రాగాలు వస్తాయంటారా ?
పువ్వు లోని పవిత్ర పరిమళం అది పరితమే
ఆ పరిమతం మరొక పువ్వు పరిమళానికి నాంది
ఉదయాన తోలి ఉషస్సు కొద్దిసేపటి ఆనందమే
ఆ ఆనందం రేపటి వుదయానికి నాంది
హృదయాన వెలిసిన స్నేహం అది పరిమతం కాదు
కొద్దిసేపటి ఆనందం కూడా కానే కాదు
ప్రతి జీవితాభ్యుదయానికి నాంది ,,,,పునాది

No comments: