Tuesday, September 1, 2009

నేను ఏమి చేసిన



నేను ఏమి చేసిన అది నీ ప్రేమ పొందటానికే


కన్నులు కాంచిన నీ ఆకాంక్ష సంద్రం లో జలకాలాడి


నీ మది గుడిలో నా ప్రేమ శిల్పాన్ని ప్రతిష్టించి


ఆనందాశ్రువుల అభిషేకాన్ని నీకు అర్పించి


ఇదంతా ఓ మధుర కావ్యంలా రచించి


నీకు నింగి లోని నక్షత్రాలను తలపించే


తలంబ్రాలను వేస్తూ వుంటే ఆ తలంబ్రాల ప్రతి ముత్యం


నీ మేనుని తడుముతూ ఆ మధుర రచనను


రంగీకరిస్తూ రమరింపజేస్తూ గుర్తు చేస్తూ


వుంటుంది ,,,,,ఏమంటావు .....మరి ////////////////////////////////

Wednesday, July 29, 2009

సప్తస్వరాల స్నేహం


మనిషి అనే బాహ్య వీణను మీటితే స్నేహం అనే స్వరం పలుకదు
మనసు అనే అంతర వీణను మీతితేనే ఆ స్నేహ స్వరానికి సప్తస్వరాలు తోడవుతాయి
స రి గ మ ప ద ని స .......లో
స- సహాయానికి దారిద్ర్యం అనే బేధం రాకుండా వుండటానికి
రి- రి బ్యాక్ లైఫ్ లో మధుర స్మృతులను గుర్తు చేసుకోవటానికి
గ- గల్లు గల్లు మంటూ సిరి మువ్వల చిరునవ్వులు పూయటానికి
మ- మనస్శాంతిని చేకుర్చటానికి
ప - పంచ ప్రాణాలతో సమానమైన స్నేహాన్ని ఆశ్వాదించి ఆరోప్రానంగా అంకితం చేయటానికి
ద -దాగివున్న ప్రతి పూవులో పరిమళం వలె స్నేహం విరబుయటానికి
ని - నిత్యం ఆ పువులతోనే స్నేహాన్ని ఆరధించటానికి
స -సంతోషంగా గడపడానికి


స్వరాన్ని సుస్వరం చేయటానికి సప్తస్వరాలు తోడ్పడుతూ తోడవుతాయి


Sunday, July 12, 2009

స్నేహ వీణ


ఆకులు లేక కొమ్మలే వుంటే
మోడుబారింది ఈ వృక్షం అని అంటాం
స్నేహం లేక మనిషి వుంటే
మోడుబారిన జీవితమే అతనిది అవుతుంది ఏమంటారు
స్నేహం లేకపోతె జీవన వీణ పలుకదు
ఒక వేళ పలికిన అందున అంతంత రాగాలే తప్ప
ఆనంద రాగాలు వస్తాయంటారా ?
పువ్వు లోని పవిత్ర పరిమళం అది పరితమే
ఆ పరిమతం మరొక పువ్వు పరిమళానికి నాంది
ఉదయాన తోలి ఉషస్సు కొద్దిసేపటి ఆనందమే
ఆ ఆనందం రేపటి వుదయానికి నాంది
హృదయాన వెలిసిన స్నేహం అది పరిమతం కాదు
కొద్దిసేపటి ఆనందం కూడా కానే కాదు
ప్రతి జీవితాభ్యుదయానికి నాంది ,,,,పునాది

Friday, July 10, 2009

అంతర్లీన నినాదం నీ స్నేహం


కోరిక కోరిక లా సాగకుండా

ఆశ ఆశ లా వెళ్ళకుండా

ఆశయం లా మారి అంతర్లీనంగా ఇచ్చే గొప్ప సందేశం నీ స్నేహం

ఆ అంతర్లీన నినాదం ,నా ఆత్మవిశ్వాస ప్రానపదమై

ఆద్యంతం అద్భుత విజయాలను చేకూర్చే

ఆనందభరితం నీ స్నేహం

నా లోన ఎడారులు విస్తరిస్తుంటే

నా

మనసుపై

హిమంని వెదజల్లి పుష్పంగా విరబుసేదే నీ స్నేహం

Tuesday, July 7, 2009

నా స్నేహ శంఖారావం


కన్నీళ్లు ఇంకిన కన్నుల్లో మెరిసే తోలి తేజానివై
కురిసే తొలకరి చినుకువై
ప్రతీ వసంతానికి చైత్రానివై
హటాత్తుగా చేలరేగే మనస్సులో కలకలం
పెదాల మీద వికలంగా కనబడకుండా ఊహాగానాల్లో తేలేట్టు
మనసులో కమల మధురిమలను ..వికసించే
సహజత్వం తో నా జీవితం లోకి ఆనందాన్ని ఆహ్వానించాలనే నీ తపన ...
నిరంతరం నన్ను వెంటాడే ఈ వాక్యాల్ని ఆశగా హత్తుకునే
హృదయన్నై నిత్యం శుద్ధి చేస్తూ మసిబారిన మనసును సాన బెట్టే నేస్తాన్నై...
పూరిస్తాను .....నీ స్నేహాక్షరాన్ని నా ఆరాధన శంఖారావం తో .......

Friday, May 29, 2009

కొత్త నేస్తానికి ,,,స్వగతం


హృదయ తీరాల స్వప్నాలతో
ప్రవాహ పలకరింపులతో ......
అలల పెదవులతో .......
నా పదాలకుప్రాణం పోసుకుంటూ
చెదరని సంతకాలతో ప్రయాణం చేసే ఓ సంకల్పం తో
నా స్వగతాన్ని ఆస్వాదించి నాకు నా స్నేహానికి
అండగా నిలబడిన ఆ నేస్తానికి .....స్వాగతం
సుస్వాగతం,,,,,,,,,,,,
కన్నుల కళల వెలుగులో కాంక్షతో ఉపేక్షించే నిరీక్షణకు తను ఒక ఓదార్పు
కన్నీళ్ళు ఒలికిన కలత చెందినా కమ్మని తన స్నేహ పలుకులు ఎంతో కమనీయం
ఓ స్నేహ కావ్యం తనని ఎంతగా చేరుకోవాలన్న ఆశ వున్నా ,,
తన స్నేహానికై పరితపించే ఆరాధన వున్నా ,,
ఏ ఆశను అందుకోలేక అనామికంగానే అలాగే వుండి
ఎదురుచూపులో ఇంట అనుభూతి వుందా అని ఆనందంతో
వుక్కిరి బిక్కిరి అవుతున్నది ,,,ఆ ఆనందంలోనే,,ఆ స్నేహ ఆకాశగంగాకై
దాహర్తిగా మిగిలివున్నది ఆ హృదయం ///////////////

Thursday, April 30, 2009

నన్ను మరవవు కదూ........




నిజంగా ఓదార్పు అంటే అది స్నేహితుల నుండే లభిస్తుంది.
\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\

నేస్తం ఎలా వున్నావు
నా హృది లోని భావాలన్నీ చెప్పడానికి వద్దామని ఆలోచించగా
చినుకుల రాలే కన్నీటి బిందువులు కూడా నీ గురించి గుబులు గా
నాతో గుండె భారం దించుకో అని చెబ్తున్నవి,,,కానీ అవి రాలే ప్రతిక్షణం
నీ ఆలోచనలే ప్రకంపనలై ప్రతిధ్వనిస్తూ నా అడుగు అడుగులో మడుగు లా
స్తిరపడ్తున్నవి............ఆ భారం దించుకునేది కాదు,,,తెన్చుకునేది కాదు,,,
కనీసం నీతో పంచుకుందాము అంటే నువ్వు తిరిగి రానీ లోకాన నన్ను చూసుకుంటూ నవ్వుతూ వున్నావు కదూ ,,,నాకు వేసిన శిక్ష అని మురిసిపోతున్నావు కదూ ,,,,,,
నువ్వు ఏది చేసిన నీ స్నేహం ను ఎంచుకుంటూ ,,,మరొకరితో పంచుకుంటూ ...............
నాలో నిన్ను పెంచుకుంటున్న నేస్తం,,,నన్ను మరవవు కదూ........
ఇట్లు
నీ .........అంజు

నా కన్నీళ్ళు నాతొ...మాట్లాడ్తున్నవి


ఎల్ల్లపుడు నీ గురించి మృదు మధురం గా ఆలోచించే నేను ,

నీ స్నేహపు వెల్లువలో వేణుగానం నై పరవిశించాను

ఆ క్షణాన నా కనుల నుండి కరిగిపొతూ ...

క్షణ క్షణాన కన్నీటి బిందువులు సిందువులుగా నేల రాలుతుండగా ,,,
నా మనసు వాటితో దోబూచులాడుతూ అడిగింది ,,,

ఆలోచన రహితం గా ,,అర్దాంతరంగా అడుగులు వెలుపలికి వేసారు ఎం అని .....

వెను వెంటనే ఆ కన్నీటి బిందువులు కన్నీరు కారుస్తూ

నీ కనుల నిండా కవ్వింపుతో నిను అక్కున చేర్చుకోవడానికి అనంత అందంతో ,,,
ఆనందముగా నీ ప్రేమ మూర్తి ముర్తిభావించి వున్నాడు కదా ,,ఇక ,,,

ఆ స్థానం మాకు నిర్వీర్యం కదా ,,,అని కన్నీరు కారుస్తూ ఆనందంతో కదిలిపోతూ చెందుతూ చెప్పినవి ............................

నేస్తం ... చూడవా నా కనుల సైతం


నేస్తం ... చూడవా నా కనుల సైతం,
నీ సేతు హృదయన్ని ముద్దాడిన నా ముగ్ధ స్నేహం అలరించి అణువణువునా ప్రసరించి మారింది
ఓ ముత్యమంత ముద్దుగా..,
ఈ నమ్మకం., నా ప్రయత్నం ఫలిస్తుందా నేస్తం?...,
నీ చిరునవ్వు కోసం ఎదురుచూసే ప్రియనేస్తాన్ని కావాలనే
నా ఆశే కాంక్షగా మారి స్నేహ నిరీక్షణకై పరితపిస్తొంది....,

అందుకే ఓ నేస్తం ఒక్కసారి చూడవా నా కనుల సైతం ....
నీ స్నేహాన్ని ఆకాంక్షించే ఆకాశ గంగ కోసం పోరాడుతున్న మన స్నేహాభిషేకాని కై, నా ఈ భగీరధ ప్రయత్నం

Wednesday, April 29, 2009

స్నేహం లాలన

ఎడం లేక ఎకమవని రెండు హృదయాలు స్నేహ సంగమం లో కలవకపోతే ఎలాయా ?

స్నేహం లాలన చేసి ,,,,ఆత్మను కానుక గా చేసి ,,,,,,,అనుభందానికి బానిస నైతిని ..................

ఆనందపుటంచులు చూసి ,,,,,చెంతకు చేరి ,,,,
నీ స్నేహపు ఏలికను అయితిని ......................

కోటి సంగీత సాహిత్య శిఖరం కావాలి మన స్నేహం .............

నేస్తమా ,,,,,,,,చైత్రమా.............

మది మది ని మనో వికాసం చెందించే మహిమాన్వితం స్నేహం

బాల్య స్నేహం తిరిగిరాని తీయదనం

యవ్వన స్నేహం యశాస్సుని ప్రసాదించే ఓ వరం
లేదా యతి గా మార్చే ఓ కలవరం .

వ్రుద్యాప్య స్నేహం తోడూ gaఅ నిలిచే తోలిసహాయ స్వర్గం .

అమర స్నేహం మరణించినా మరల జన్మించి స్నేహితులుగా
వుండాలనే ఆశే అద్భుతమైన అమృత దీపారాధానం .

చెరిగి పోనీ కలగా ఓ అద్భుతం మన స్నేహం కావాలని
వాడిపోని పుష్పంగా ఓ అపురూపం మన స్నేహం కావాలని

నా మనసు లో nఐ భావాలను మధురంగా వ్యక్తపరుస్తున్న

నేస్తమా ,,,,,,,,చైత్రమా.............
.....

ఒక ఆశ నా స్నేహంతో,,,,

స్నేహపు వుశాస్సు లో తోలి కీర్తి గా ,,,,,

మల్లెల మాల లో ఒక చిరు నవ్వు పరిమళం గా ,,,,,

మమతల కలశం లో మధు హృదయంగా,,,,,

నా మనసు నెలవంక లో ఎ వంక లేని మానస సరోవరం గా ..........

వెలిసిన వెలుగు వెన్నలాగా ప్రజ్వలిల్లలని ,,,,,,,,,,,

విశ్వమే దానికి ప్రనమిల్లలని ,,,,,,,,,,,,,,,,ఆశిస్తూ ..
................

ఈ స్నేహం ......... ఈ స్నేహం ........

ఈ స్నేహం


బ్రహ్మ లోకమున శారద వీణ పై సప్తస్వరాలను పలికించేది
శివ లోకమున చిద్విలాసముతో డమరుక ధ్వనిని వినిపించేది
కేశవ లోకమున సిరిసంపదలను విరజిల్లేది
అల్లా తత్వమున అల్లారుముద్దుగా జనించి మరణం లేనిది
ఏసు శిలువతో చేసిన ప్రయాణం
సర్వ జనవాలికి శుభ ప్రదం ఈ స్నేహం
అన్ని మతాలను మమతలుగా అల్లుకుని అనురాగాలను తనలో దాచుకుని
అవేశాక్రోశాలను తెంచుకుని ఆనందావేదనలను పంచుకుని
నిరంతరం నిరశానిస్ప్రుహ మేఘాలను హృదయ నింగి నుండి మధనం
గావించి పులవర్ష గెలుపుగా అందజేసేదే

ఈ స్నేహం ......... ఈ స్నేహం .........

Tuesday, March 17, 2009

నా ప్రేమ


నిన్ను చేర మనసాయెనే ఓ సఖి

నీ స్వేదమునే పన్నీటి గంధముగా తీసుకున్నదే
నీ శ్వాసతో మధుశ్వాసగా ముడివేసిన నా ఆశనే.
ఆపలేని నా హావభావాలన్నీ నిన్ను చేరెనే
చేరిన ఆ భావాలతో నీ స్పర్శమిలితంను పంపించవే.
చింత వున్నా చిరునవ్వును చిందించే నా మనసును
నీ స్పర్శతో సప్తస్వరాలను పలికించవే.

Sunday, January 18, 2009


ఆ మృత్యు సాగర తీరాన వేచి వున్నా ,,,,అది నీ కొరకే,,
మరణించి మరల జన్మిస్తాను మరు క్షణం నీ ఉపిరితో జత కూడుతాను,,,
మంచు మలయ మారుతాన్నై నీ మనసు లో మైమరిచి మధురంగా ,,,పవలిస్తాను
కాల గమనం లో ఎన్ని యుగాలు గడిచినా,,,నీ తో గడిపిన గత స్మృతులు నన్ను మరల మరల
ఆ మృత్యు సాగర తీరం లో వేచిచూసిన ,,నీ నయనాలకు దగ్గరహ్గా వుండాలని,,,
,చెలి,,,,
నేను అమ్మ పొత్తిళ్ళలో జన్మించినా,,,ఆ జన్మకు తన ఋణం తీర్చుకుంటాను,,,,అది ఒక బాధ్యత
కాని నా మరణం మాత్రం నీ ప్రేమ పోత్తిల్లలోనే,,,అది నాకు ఒక తీయని జ్ఞాపిక ..................