నా ఆక్రోశమంతా ఇపుడు ఆకృతి ఉన్న ఒక జీవం గా మారింది
నా ఆవేదనంతా ఇపుడు నిశ్శబ్దమైన శబ్దం గా మారింది
ఇవన్నీ ఆ ఓంకార నాదంలో సమీకృతమై ఈ కృతి ని శృతి గా అందజేస్తున్నాయి....
నా మనసు లో భావాలన్నీ చెప్పడానికి వస్తున్నా మది భారాన్ని మోపలేక,,,,,,,,,,,కురిసి వెళ్ళిపోయిన ఓ వాన ఒక్కసారి మేఘాల కుచిల్ల నుంచి జారవా నా పైన
నేను ఏమి చేసిన అది నీ ప్రేమ పొందటానికే
కన్నులు కాంచిన నీ ఆకాంక్ష సంద్రం లో జలకాలాడి
నీ మది గుడిలో నా ప్రేమ శిల్పాన్ని ప్రతిష్టించి
ఆనందాశ్రువుల అభిషేకాన్ని నీకు అర్పించి
ఇదంతా ఓ మధుర కావ్యంలా రచించి
నీకు నింగి లోని నక్షత్రాలను తలపించే
తలంబ్రాలను వేస్తూ వుంటే ఆ తలంబ్రాల ప్రతి ముత్యం
నీ మేనుని తడుముతూ ఆ మధుర రచనను
రంగీకరిస్తూ రమరింపజేస్తూ గుర్తు చేస్తూ
వుంటుంది ,,,,,ఏమంటావు .....మరి ////////////////////////////////
మనిషి అనే బాహ్య వీణను మీటితే స్నేహం అనే స్వరం పలుకదు
మనసు అనే అంతర వీణను మీతితేనే ఆ స్నేహ స్వరానికి సప్తస్వరాలు తోడవుతాయి
స రి గ మ ప ద ని స .......లో
స- సహాయానికి దారిద్ర్యం అనే బేధం రాకుండా వుండటానికి
రి- రి బ్యాక్ లైఫ్ లో మధుర స్మృతులను గుర్తు చేసుకోవటానికి
గ- గల్లు గల్లు మంటూ సిరి మువ్వల చిరునవ్వులు పూయటానికి
మ- మనస్శాంతిని చేకుర్చటానికి
ప - పంచ ప్రాణాలతో సమానమైన స్నేహాన్ని ఆశ్వాదించి ఆరోప్రానంగా అంకితం చేయటానికి
ద -దాగివున్న ప్రతి పూవులో పరిమళం వలె స్నేహం విరబుయటానికి
ని - నిత్యం ఆ పువులతోనే స్నేహాన్ని ఆరధించటానికి
స -సంతోషంగా గడపడానికి
స్వరాన్ని సుస్వరం చేయటానికి సప్తస్వరాలు తోడ్పడుతూ తోడవుతాయి