Wednesday, July 29, 2009

సప్తస్వరాల స్నేహం


మనిషి అనే బాహ్య వీణను మీటితే స్నేహం అనే స్వరం పలుకదు
మనసు అనే అంతర వీణను మీతితేనే ఆ స్నేహ స్వరానికి సప్తస్వరాలు తోడవుతాయి
స రి గ మ ప ద ని స .......లో
స- సహాయానికి దారిద్ర్యం అనే బేధం రాకుండా వుండటానికి
రి- రి బ్యాక్ లైఫ్ లో మధుర స్మృతులను గుర్తు చేసుకోవటానికి
గ- గల్లు గల్లు మంటూ సిరి మువ్వల చిరునవ్వులు పూయటానికి
మ- మనస్శాంతిని చేకుర్చటానికి
ప - పంచ ప్రాణాలతో సమానమైన స్నేహాన్ని ఆశ్వాదించి ఆరోప్రానంగా అంకితం చేయటానికి
ద -దాగివున్న ప్రతి పూవులో పరిమళం వలె స్నేహం విరబుయటానికి
ని - నిత్యం ఆ పువులతోనే స్నేహాన్ని ఆరధించటానికి
స -సంతోషంగా గడపడానికి


స్వరాన్ని సుస్వరం చేయటానికి సప్తస్వరాలు తోడ్పడుతూ తోడవుతాయి


Sunday, July 12, 2009

స్నేహ వీణ


ఆకులు లేక కొమ్మలే వుంటే
మోడుబారింది ఈ వృక్షం అని అంటాం
స్నేహం లేక మనిషి వుంటే
మోడుబారిన జీవితమే అతనిది అవుతుంది ఏమంటారు
స్నేహం లేకపోతె జీవన వీణ పలుకదు
ఒక వేళ పలికిన అందున అంతంత రాగాలే తప్ప
ఆనంద రాగాలు వస్తాయంటారా ?
పువ్వు లోని పవిత్ర పరిమళం అది పరితమే
ఆ పరిమతం మరొక పువ్వు పరిమళానికి నాంది
ఉదయాన తోలి ఉషస్సు కొద్దిసేపటి ఆనందమే
ఆ ఆనందం రేపటి వుదయానికి నాంది
హృదయాన వెలిసిన స్నేహం అది పరిమతం కాదు
కొద్దిసేపటి ఆనందం కూడా కానే కాదు
ప్రతి జీవితాభ్యుదయానికి నాంది ,,,,పునాది

Friday, July 10, 2009

అంతర్లీన నినాదం నీ స్నేహం


కోరిక కోరిక లా సాగకుండా

ఆశ ఆశ లా వెళ్ళకుండా

ఆశయం లా మారి అంతర్లీనంగా ఇచ్చే గొప్ప సందేశం నీ స్నేహం

ఆ అంతర్లీన నినాదం ,నా ఆత్మవిశ్వాస ప్రానపదమై

ఆద్యంతం అద్భుత విజయాలను చేకూర్చే

ఆనందభరితం నీ స్నేహం

నా లోన ఎడారులు విస్తరిస్తుంటే

నా

మనసుపై

హిమంని వెదజల్లి పుష్పంగా విరబుసేదే నీ స్నేహం

Tuesday, July 7, 2009

నా స్నేహ శంఖారావం


కన్నీళ్లు ఇంకిన కన్నుల్లో మెరిసే తోలి తేజానివై
కురిసే తొలకరి చినుకువై
ప్రతీ వసంతానికి చైత్రానివై
హటాత్తుగా చేలరేగే మనస్సులో కలకలం
పెదాల మీద వికలంగా కనబడకుండా ఊహాగానాల్లో తేలేట్టు
మనసులో కమల మధురిమలను ..వికసించే
సహజత్వం తో నా జీవితం లోకి ఆనందాన్ని ఆహ్వానించాలనే నీ తపన ...
నిరంతరం నన్ను వెంటాడే ఈ వాక్యాల్ని ఆశగా హత్తుకునే
హృదయన్నై నిత్యం శుద్ధి చేస్తూ మసిబారిన మనసును సాన బెట్టే నేస్తాన్నై...
పూరిస్తాను .....నీ స్నేహాక్షరాన్ని నా ఆరాధన శంఖారావం తో .......