Monday, December 18, 2017

నా ఆవేశమంతా

నా ఆవేశమంతా  ఇపుడు ఆలోచనగా  మారింది 
నా ఆక్రోశమంతా  ఇపుడు  ఆకృతి ఉన్న  ఒక  జీవం గా  మారింది 
నా  ఆవేదనంతా  ఇపుడు  నిశ్శబ్దమైన శబ్దం గా  మారింది 
ఇవన్నీ ఆ  ఓంకార  నాదంలో  సమీకృతమై  ఈ కృతి ని  శృతి గా  అందజేస్తున్నాయి....
నీ మురళి లో  ఊపిరి పోసుకున్న  శూన్యం గా నైనా  ..ఈ జీవనాన్ని  ఒక రాగంగా  మలచవా ...
చివరి చరణం లో నైనా నీ  శరణాగతి ని  అనుగ్రహించి నా  గతి  మార్చవా ......కృష్ణా ....

నీ ఊపిరిని దాచుకున్న  వెదురు ఏమి తప్పస్సు చేసిందో ,,,
ఓ వనమాలి  నీ దేహాన్ని  విడవని ఆ వైజయంతి పుష్ప వరమాల
ఎన్ని జన్మల పుణ్యం చేసిందో .........
నీ నమ స్మరణ జేస్తున్న నాకు త్రోవనైనా చూపించవా ....కృష్ణా ...
నవరస సమ్మోహన గీతిక అది నీ మురళి లో దాగిన మానస సరోవర పేటిక .....
ఓ  వనమాలి చూపించవా  వనాంతాల దాగిన అందాల డోళిక....i
ఇక నైనా  దొరికేనా ఆ  జ్ఞాన వాటిక  
తొలిగెనా అజ్ఞాన మరుభూమి వాటిక ..

Friday, October 20, 2017

మనసు ప్రతీ చిన్న విషయానికి మసిబారుతూనే ఉంటుంది
కానీ దానిని శుద్ధి చేసే ఆయుధం కావాలి
అదే ప్రేమ
కానీ ఈ సమాజం లో
దానికి గుర్తింపు లేదు

రక్త సంబంధాలే బలహీనమవుతున్నాయి

ఒక మనసు
దానిని పంచుకునే మనిషి
అస్పష్టత లేని ఈ దేహానికే

అయినా మనిషి దాహం తీరక
మనసుకి దాహార్తి అందక
అహంకారం ను  ఆశ్రయించి
అనుభూతిని పొందడం లేదు

ఇక మసిబారిన మనసు ను
మనసును అంటిపెట్టుకొని ఉన్న
ఈ మాయాదేహంను
శుద్ది చేయాలంటే

ఒకటే
అన్వేషణ
పరంజ్యోతి అన్వేషణ